తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం . ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీళ్లు అందించనున్నది ప్రభుత్వం.
తాజాగా దేవాదుల ఎత్తిపోయల పథకంలో చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నీళ్ల తరలింపునకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
మల్లన్నసాగర్ నుంచి దేవాదులలోని తపాస్ పల్లి రిజర్వాయర్ కు అనుసంధానం చేయాలి. వచ్చే ఏడాదిలోగా మల్లన్నసాగర్ ,సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.