అసలు మూవీల్లో గూడఛారి సినిమాలననగానే మనకు గుర్తొచ్చే హీరో జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే.
అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్ ఇవ్వమని రాధికాకు వచ్చిన ఆ కబురు సారాంశం.
అంతే.. వాళ్లు అడిగినట్లుగా తన లుక్, నటనను రికార్డ్ చేసి పంపించారు. ఈ సినిమాతో పాటు రాధికా ఆప్టేకు ‘స్టార్ వార్స్’ ఆఫర్ కూడా రావడం విశేషం. అయితే దీనిపై రాధికా మాట్లాడుతూ‘‘ఈ పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని ఓ గీత గీయకుండా నాలాంటి ఆర్టిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని, అవకావం ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా శుభవార్తే’’ అని అన్నారు.