యావత్తు దేశమంతా ఈ రోజు గత కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్ లో అయోధ్య స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమిచ్చే తీర్పు గురించి చర్చించుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు అయోధ్యపై తీర్పు నేపథ్యంలో సందేశమిచ్చారు.
సరిగ్గా ఏడాది కిందట మంత్రి కేటీఆర్ వెల్లడించిన అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూ” అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తీర్పు ఎలా వచ్చిన కానీ అందరూ శాంతి,వివేకంతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
అయితే ఏడాది కిందట నవంబర్ 27వ తారీఖున టైమ్స్ నౌ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” మందిరం మసీదుతో పేదలకు ఎలాంటి ఒరిగేది ఏమి లేదు అని చెప్పారు. దీనికంటే పేదలకు అవసరమైన వాటికోసం ఆలోచిస్తే బాగుంటదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.