అత్యంత వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పు ఇస్తున్న నేపద్యంలో ఇవాళ ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ అయోధ్య కేసు తుది తీర్పు నేపథ్యంలో సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అయోధ్య వివాదం ఏర్పడింది. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు పెద్దగా ఈ వివాదంపై సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అయోధ్య ఇష్యుని పరిష్కరిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.