తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీ రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సబ్ స్టేషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తమకు చేస్తోన్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా శాలువా కప్పి చిరుసన్మానం చేయాలని నిర్ణయించుకుని చుట్టూ ప్రక్కల ఉన్న రైతన్నలు శాలువా తీసుకొచ్చారు.
అయితే ఇందులో నర్సింహారెడ్డి అనే రైతు” అయ్యా మంత్రి కేటీఆర్ సారు మాకోసం ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేస్తోన్నారు. అడిగినవన్నీ ఇస్తున్నారు. మా కళ్లల్లో వెలుగులు నింపుతూ మా జీ వితాల్లో ఆనందాలను అందిస్తున్నారు. అలాగే మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన గోదాం హామీని కూడా వీలైనంత త్వరగా నెరవేర్చండి. త్వరలోనే యాసంగి పంటలు మొదలవుతాయి”అని ధైర్యంగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో మంత్రి కేటీఆర్ రైతన్న ధైర్యానికి ముగ్ధుడై.. మీరే చెబుతున్నారు.
అవి చేశా.. ఇవి చేశానని.. ఇన్ని చేసిన నాకు మీకు నేను కట్టిస్తానని అన్నా గోదాంను కట్టించలేనా. కట్టిస్తాను .. మీకోరిక నెరవేరుస్తా”అని తెలిపారు. దీంతో సంబురంతో ముందుగానే తెచ్చుకున్న శాలువాను మంత్రి కేటీఆర్ పై కప్పబోయారు. దీనికి ప్రతి స్పందనగా మంత్రి కేటీఆర్ నేను గోదాం కట్టించినాక నీతోనే శాలువా కప్పించుకుంటా.. ఇప్పుడైతే నాచేత శాలువా కప్పించుకో తాతా అంటూ మంత్రి కప్పేసరికి అక్కడున్నవారు ఆనందంతో చప్పట్లు కొడుతూ.. మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ షాకవ్వుతూ.. మంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు.