తమిళనాడు ప్రజల ఆరాధ్య నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా దర్బార్. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ దర్బార్ పోస్టర్ను విడుదల చేశారు. తమిళంలో కమల్ హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్ ఈ పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఆదిత్య అరుణాచలం పోలీస్ అధికారి పాత్రలో రజినీకాంత్ జీవిస్తున్నారు. అనిరుద్ధ్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తుండగా 2020 సంక్రాంతి పండుగ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద పోలీస్ గెటప్ లో కత్తి పట్టుకుని వీల్ చైర్ లో నవ్వుతూ ఆయన అభిమానులకు కనువిందు చేస్తోంది.