తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎస్ఎస్ఏలో తాత్కాలిక,కాంట్రాక్ట్ పద్ధతుల్లో మొత్తం 383 పోస్టుల భర్తీకి నిన్న బుధవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులల్లో మేనేజ్మెంట్ ఇన్ఫ్ ర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఎంఆర్సీలో కోఆర్డినేటర్లు పోస్టులు 144, డీఈవో,డీపీవో,ఎస్ఎస్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138, సిస్టం అనలిస్టులు12,అసిస్టెంట్ ప్రోగ్రామర్లు 27 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు.
ఈ పోస్టులకు సంబంధించిన అర్హత ఇతర అంశాల గురించి పూర్తి వివరాలను ఈ నెల పదిహేనో తారీఖున వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తారు. అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 23 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ రెండో వారంలో హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.