Home / SLIDER / ఉద్యమ కారుడే నాయకుడైతే..?

ఉద్యమ కారుడే నాయకుడైతే..?

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు జరిగిన మలి దశ ఉద్యమ ఫలితంగా.. ఎన్నో పోరటాలు.. మరెన్నో ఉద్యమాలు.. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి విదితమే. ఈ మలిదశ ఉద్యంలో ముఖ్యమంత్రి నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకుడు నకిరేకల్ మాజీ శాసనస సభ్యుడు వేముల వీరేశం .

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయంపాలైయ్యారు. అయిన కానీ వేముల వీరేశం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల మధ్య తిరుగుతూ నేనున్నాను అని భరోసానిచ్చాడు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో”కట్టంగూర్ గ్రామంలో నిరు పెద కుటుంబానికి చెందిన సిక్కుల లింగయ్య కుటుంబం రోజు వారి కూలి పనులతో జీవితాన్ని గడుపుతున్న అతనికి పెళ్ళిడుకోచ్చి రెండవ అమ్మాయి పెళ్ళి చేయాలి. సర్తెన వసతులు లేవు డబ్బులేవు “పెళ్ళికుదిరింది”ఏమి చేయలేని పరిస్థితి.

అప్పుడే వాళ్లకు పదవులున్న లేకపోయినఅపదలో ఉన్నారంటే అదుకునే “అతను”గుర్తుకు వచ్చాడు. అంతే లింగయ్య “అతని” వద్దకు వెళ్ళి వారి బాదలు వివరించగా నా కార్యకర్తలు ఎప్పుడు దేనికి సందేహం పడవద్దు నేరుగా నన్ను సంప్రదించండి నేను మీక అండగా వుంట అని వారిని ఓదార్చి.. నేనున్నాను వెళ్ళి పనులు చేసుకొండి.పెళ్ళికయ్యే ఖర్చుతో సహా పంక్షన్ హల్ మొత్తం నేను ఇస్తాను అని హామీచ్చాడు తీరా పెళ్లి రోజు ఆశీర్వదించడానికి వచ్చిన అతనికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియక ఇలా ఆయన కాళ్లపై పడి ఆశీర్వదం తీసుకున్నారు. దీంతో వేముల వీరేశంపై నెటిజన్లు

అందుకే “ఉద్యమ కారుడే నాయకుడైతే..?..
ఆపదల్లో ఉన్నవారికి అండగా ఉంటాడు.
సమస్య అంటే నేనున్నానే భరోసానిస్తాడు.
ప్రజల కష్టమే తన కష్టంగా భావిస్తాడు.
ప్రజల సుఖసంతోషాలే తన సుఖసంతోషాలనుకుంటాడు.
వీరేశమన్న నేటి తరానికి ఆదర్శంగా నిలిచావు అన్న.. నువ్వు.. హ్యాట్సాప్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat