యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై తకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి తన టాలెంట్ తో పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒక్కడుగా నిలిచాడు. డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదు. దాంతో ఒక్కసారిగా అభిమానులకు ఆందోళన మొదలయింది. తన ప్లేస్ లో డీ లోకి వచ్చిన రవి ప్రదీప్ ఆరోగ్యం బాలేదని అందుకే దూరంగా ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు. అలా చెప్పి చాలారోజులే అయ్యింది. దాంతో అభిమానులు ఆయనకు ఏం అయిందో అని మదనపడుతున్నారు. మరోపక్క ప్రదీప్ కు ఆరోగ్యమే సమస్య కాదు, ఇంకేదో సమస్య ఉందని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే కచ్చితంగా సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ పెడతారు కదా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.మరి ప్రదీప్ కి ఏమైంది ఎలా ఉన్నాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
