సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. అయితే ఈ ప్రాతంలో ఇప్పుడు ఆర్టికల్ 370 కి సంబంధించి ఇక్కడ కొన్ని అనుమతులు లేకుండా చేసారు. ఇందులో భాగంగానే అన్నీ చూసుకొని మహేష్ కి కూడా బులెట్ ప్రూఫ్ సెక్యూరిటీ నియమించడం జరిగిందని అనిల్ సుంకర చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు.
