తెలంగాణ రాష్ట్రంలో పలు వ్యవసాయ మార్కెట్లలో రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ మొదలయింది. గత వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” రాష్ట్రంలోని రైతన్నలు దిగులు పడోద్దు. ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు. మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.
వాటి దగ్గరనే ఆరుగాలాలపాటు శ్రమించి..పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలి “రాష్ట్రంలోని రైతన్నలకు సూచించారు. మంత్రి హారీష్ రావు చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది.
ఇందులో భాగంగా మొత్తం 3,327 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే మూడు వందలకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు గిట్టుబాటు ధరపై అవగాహన కల్పిస్తూ రైతన్నల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తుంది ప్రభుత్వం