Home / ANDHRAPRADESH / జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!

జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!

భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్‌, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ సినిమాలు చేసుకుంటానని పవన్ అన్నారు. జనసేనాని విమర్శలకు వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి కాదు అఙ్ఞానవాసి అని మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవంతి మాట్లాడుతూ..పుస్తకాలు చదివినంత మాత్రాన రాజకీయ నాయకులు కారని పవన్‌కు చురకలు అంటించారు. మీకులా అన్నను అడ్డుపెట్టుకుని ఎదిగినవాడిని కాదని, తాను స్వయం కృషితో ఎదిగిన వ్యక్తిని అని మంత్రి అన్నారు. సినిమావాళ్లంటే తమకు గౌరవం ఉందని..కాని ఆదివారం నాడు లాంగ్‌మార్చ్ లో పవన్ వాడిన భాష చాలాదారుణంగా ఉందని మంత్రి ధ్వజమెత్తారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి చాలా ఇప్పటికే చాలా మంది నష్టపోయారు… ఆయనకు ఇప్పుడు మీరు దొరికారని బాబు ట్రాప్‌లో ఇరుక్కోవద్దని అవంతి పవన్‌కు సలహా ఇచ్చారు. అసలు కమ్యూనిస్టులు, బీజేపీలు ఎలా ఆవిర్భవించాయో…. వాటి సిద్ధాంతాలేమిటో తెలుసా….? టీడీపీ లాంటి అవకాశవాద పార్టీలతో పని చేస్తున్న పవన్…. సిద్ధాంత పరంగా వైరుధ్యం కలిగిన పార్టీలను ఎలా కలుపుకొందామనుకున్నారని అవంతి పవన్‌‌ను ప్రశ్నించారు. ఒకవేళ టీడీపీతో మీరు కలిసిపోతే మాకు అభ్యంతరం లేదు… కానీ ఈ చీకటి ఒప్పందం దేనికి? అని మంత్రి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా ఇసుక రవాణాలో వుంటే నిరూపించండి కాని ఇసుక దోపిడీ అంటూ పసలేని విమర్శలు చేయద్దని సూచించారు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఇసుక తీయడం కష్టతరంగా మారుతుందన్న విషయం మీకు తెలుసా..అని అవంతి పవన్‌ను ప్రశ్నించారు. ఇసుక కొరతపై పవన్ విధించిన రెండు వారాల డెడ్‌‌లైన్‌పై కూడా అవంతి స్పందించారు… మీరు మాకు రెండు వారాలు టైం ఇచ్చేందేంటి…? వరద తగ్గితే ఇసుక పంపిణీని పునరుద్ధరిస్తాం’ అని పవన్‌ తీరును ఎండగట్టారు. లాంగ్ మార్చ్ పేరు చెప్పి 2 కిలోమీటర్లు కూడా నడవలేని పవన్…. రాజకీయాల్లో ఎలా రాణిస్తారు అని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సీఎం జగన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులపై పవన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ… ‘ దేశంలో కేసులు లేని నాయకులు ఎవరు? కక్షపూరిత రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం కొత్తేమీ కాదు. విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత పవన్‌కు లేదు. బొత్స, కన్నబాబుల గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం అన్యాయం. కాపుల్లో మీరు తప్ప ఇంక ఎవరూ ఎదగకూడదా…?ఎందుకు మీకా అక్కసు…? భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్…. ఒక సినిమా ఉచితంగా చేసి ఆ డబ్బు వాళ్ళకివ్వొచ్చు కదా…? పవన్ కల్యాణ్ ఇప్పటికే పార్టీ పెట్టి పరువు తీసుకున్నాడు. ఇంకా దిగజారిపోవద్దు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదు’ మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కల్యాణ్‌ను అని హెచ్చరించారు. మొత్తంగా పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి కాదు అఙ్ఞానవాసి అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వేసిన సెటైర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat