తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు శనివారం భేటీ కానున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నాం హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటలకు సమావేశం కానున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీపై చర్చించనున్నారు. మొత్తం నలబై ఎనిమిది వేల మంది ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తోన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కరణకోసం శాశ్వత మార్గాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి వర్గం చర్చించనున్నది.