Home / ANDHRAPRADESH / బాబు, పవన్, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్..!

బాబు, పవన్, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర‌్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలు భారీగా పడి, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకోవడంతో ఇసుక రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో ప్రజలందరికి నాణ్యమైన ఇసుక చవక ధరకే అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో జనసేన, టీడీపీలు ఇసుక కొరత అంటూ జగన్ సర్కార్‌పై దుష్ప్రచారం చేస్తోంది. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై తనదైన స్టైల్లో నాలుగుగంటల పాటు నిరాహారదీక్ష చేసి ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. అయితే నాలుగు గంటలు నిరాహారదీక్ష ఏంది చినబాబు అని నెట్‌జన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు నవంబర్ 3 వ తేదీన విశాఖ భవన నిర్మాణ కార్మికులతో భారీ కవాతు నిర్వహించబోతున్నాడు. ఈ కవాతుకు కలిసిరావాల్సిందిగా అన్ని ప్రతిపక్షాలను పవన్ స్వయంగా కోరాడు. అయితే బీజేపీ ఈ కవాతుకు దూరంగా ఉండగా..టీడీపీ మాత్రం మద్దతు పలికింది.

 

 

బాబు, లోకేష్, పవన్‌ల ఇసుక రాజకీయాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు. ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికేది కాదు. మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను చంద్రబాబు పెంచిన మాఫియా స్మగుల్ చేసింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేది. చేసింది చాలక ప్రభుత్వం కూలిపోతుందని ‘మాలోకం’ పిల్లి శాపాలు పెడుతున్నాడంటూ బాబు, లోకేష్‌పై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఇక ఇసుక కొరత పేరుతో ‘ఇస్కో… ఉస్కో’ అనడమే పరువు తక్కువ పని. దానికి ఈయన సంపూర్ణ మద్ధతు ఇస్తారట. పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజి సమకూర్చడం నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా నిర్మాణం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ మీరే కదా.మళ్లీ సపోర్టు స్టేట్ మెంట్ ఎందుకో?ఎవరికీ తెలియదనుకుంటున్నాడు..అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు..బాబు, పవన్, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి వేసిన సెటైర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat