టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నో చెప్పిన ఒక కథను ఒకే చేసేశాడు మరో స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేశాడు. తాను సిద్ధం చేసిన కథను హీరో మహేష్ బాబుకు విన్పించాడు.
అయితే కథ నచ్చకపోవడంతో మహేష్ నో చెప్పాడు. ఏమి పాలుపోని సుకుమార్ ఈ కథను బన్నీకు చెప్పాడు. అంతే కథ నచ్చడంతో.. కాస్త మార్పులతో ఒకే చెప్పేశాడు. ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు నిన్న బుధవారం మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో మొదలయ్యాయి.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ,ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా రష్మిక మంధాన హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహాకుడు :మిరోస్లోవ్ కుబ బ్రోజెక్,ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, కళ : రామ కృష్ణ ,మౌనిక,సీఈఓ: చెర్రీ, లైన్ ప్రోడ్యూసర్ : బాలసుబ్రహ్మణ్యం కెవివి,సహా నిర్మాత: ముత్తంశెట్టి మీడియా, నిర్మాతలు :నవీన్ ఎర్నేనీ-రవిశంకర్ వై .