బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మొదట నుంచి తనకు తాను కృష్ణావతారంగా చెప్పుకునే తేజ్ ప్రతాప్ తాజాగా దీపావళి పండుగ నాడు సరికొత్త అవతారమెత్తాడు. ఇందులో భాగంగా మధురలో పెద్ద జుట్టు,నుదుటన తిలకంతో దీపావళి నయా లుక్ తో ప్రత్యేక్షమయ్యాడు. వేడుకల్లో పాల్గొన్న ప్రతాప్ గోవర్ధన పూజ నిర్వహించి యమునా నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. తేజ్ ప్రతాప్ నయా లుక్ పై బీహార్ రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు.
