ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.