తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం అడ్డు తగిలి ..ప్రజాప్రయోజనాలకు అడ్డుపడితే రాష్ట్ర ప్రజల చేతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రతిపక్షాల వీపు మోగుతుంది అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .
రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న కాంగ్రెస్ నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై స్పందిస్తూ ప్రతిపక్షం సభలో అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తాం ..వాళ్ళు అడిగిన రోజులంటే ఎక్కువగా సభను నిర్వహిస్తాం ..ప్రజల సమస్యలపై చర్చించడానికి మేము ఎప్పుడు సిద్ధమే .సభలో ప్రజల సమస్యలను చర్చించకుండా రోడ్ల పై తిరుగుతూ ప్రజాప్రయోజనాలకు అడ్డు తగిలితే ప్రజల చేతిలో వాళ్ళ వీపులు పగలడం ఖాయం అన్నారు ..