తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు .
ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు .ఈ లేఖపై స్పందించిన చంద్రబాబు నాయుడు తను విదేశాల నుండి తిరిగి వచ్చేవరకు పార్టీ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రేవంత్ రెడ్డిను ఆదేశించారు .
దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి గురువారం ఉదయం పది గంటలకు తప్పకుండ టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తాను .ఎల్ రమణ ఎవరు నన్ను నిర్వహించవద్దు అని చెప్పడానికి అని బీరాలు పలికాడు .తాజాగా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు .తానూ ఈ రోజు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించను .పార్టీ అధ్యక్షుడు నిర్వహించే సమావేశంలో పాల్గొంటాను అని ఆయన మీడియాకు తెలిపారు .