న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో 79 పరుగుల వద్ద కోహ్లీ (29) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో కలిసి శిఖర్ ధవన్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో వన్డేల్లో 22వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 84 బంతులు ఎదుర్కొన్న ధవన్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుటయ్యాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాటిగా ఆడిన హార్ధిక్ పాండ్యా (30) కూడా అవుటవడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ మిగతా పని పూర్తి చేశాడు. దినేశ్ కార్తీక్ 64, ధోనీ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. న్యూ జిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడం మిల్నే, మిచెల్ సాంట్నెర్, గ్రంధోమ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్, కివీస్‌లు చెరో విజయంతో సమంగా ఉండడంతో కాన్పూర్‌లో ఈనెల 29న జరగనున్న చివరి వన్డే రసవత్తరంగా మారనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ (11), కోలిన్ మున్రో (10), కానె విలిమ్సన్ (3), ఆడం మిల్నె(0)లు విఫలమయ్యారు. రాస్ టేలర్ (21), టామ్ లాథమ్ (38), హెన్రీ నిఖోల్స్ (42) గ్రంధోమ్ (41), సాంట్నెర్ (29), టిమ్ సౌథీ 25-నాటౌట్) పరవాలేదనిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా జస్ప్రిత్ బుమ్రా , చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.ఓపెనర్ రోహిత్ శర్మ (7; 19 బంతుల్లో 1×4) ఔటయ్యాడు