తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే.
దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను కాదని మరి తన సతీమణిని నిలబెట్టి గెలిపించుకోలేకపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తోన్న తరుణంలో ఉత్తమ్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది.