భారత క్రికెట్లో దాదా(బెంగాల్ టైగర్) హవా ప్రారంభమైంది. తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ… బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ ఘనత సాధించారు. ఇంతకు ముందు విజయనగరం మహారాజా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిన్న సోదరుడే అరుణ్ ధుమాల్. గంగూలీతో పాటు వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.