అనుకున్న సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సినీ నటి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠికి చెందిన ప్రముఖ సినీ నటి పూజ జుంజర్(హింగోలి కు చెందిన)కు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి.
దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కాసేపటికి కన్నుమూసింది. దీంతో ఆ నటిని నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి వైద్యులు సిఫారస్ చేశారు.
ఆమెను తరలించే క్రమంలో అంబులెన్స్ రావాల్సిన సమయానికి రాకపోవడంతో మార్గమధ్యలో పూజ కన్నుమూసింది. అయితే ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.