ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు,మహిళలు,యువత,రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సైదిరెడ్డికి హుజూర్ నగర్ నుంచే కాకుండా బయట నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయంలో సైదిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జేఏసీ నేతలు కొంతం గోవర్ధన్ రెడ్డి,ఉపేంద్ర,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.