మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం ఎంతో తెలుసా..?. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?. 2018-19 ఏడాదికి ఎంతమొత్తంలో తీసుకున్నాడో తెలుసా..?. 2018-19ఏడాదికి సత్య నాదెళ్ల తీసుకున్న జీతం అక్షరాల రూ.305 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సత్యనాదెళ్లకు 65% జీతం పెరిగింది.
ఆయన మూల వేతనం రూ.16.63 కోట్లు. అధిక శాతం సంపాదన సంస్థ షేర్ల నుంచే వచ్చింది కావడం గమనార్హం. ఆయనకు రూ.200 కోట్లు షేర్ల రూపంలో రూ.79 కోట్లు నాన్ ఈక్విట్ ప్రోత్సహక పరిహారం ,రూ.79 లక్షలు ఇతర పరిహారాల ద్వారా లభ్యమైంది. 2014లో మైక్రోసాప్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల గత ఏడాది దాదాపు రూ.183 కోట్లు జీతం అందుకున్నారు.