చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఈ మధ్య రూట్ మార్చారు. కాషాయ పార్టీలో చేరినా.. పాపం మన సుజనాగారి మనసు బాబుగారి చుట్టే తిరుగుతుంది. అందుకే టీడీపీ హయాంలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, కీలక నేతలు రైతులను మోసం చేసి, వందలాది ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించారంటూ..రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ… ఒక్క పక్క జీవియల్ వంటి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుంటే…సుజనా చౌదరి మాత్రం రాజధానిలో అవినీతే జరగలేదని, నాకు ఒక్క ఎకరం కూడా బినామీలపేరుతో లేదని..బుకాయించాడు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదంటూ రంకెలు వేశాడు. బీజేపీ ఎంపీగా ఉండి ..ఏకంగా టీడీపీ నేతలతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ రైతులను రెచ్చగొట్టాడు. అప్పుడు సుజనాకు టీడీపీ ఆఫీసు నుంచే స్క్రిప్ట్ వస్తుందని, ఆ స్క్రిప్ట్‌లోని డైలాగులే చదువుతున్నాడంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు చంద్రబాబును మళ్లీ మోదీకి దగ్గర చేయడానికి సుజనా తనవంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే గత రెండు, మూడు రోజులుగా సుజనా గారు చంద్రబాబుపై నమ్మలేని విధంగా విమర్శలు చేస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది..రెండు రోజుల క్రింతం జగ్గయ్యపేటలో మనసులో బాపూ పేరుతో గాంధీ సంకల్పయాత్ర చేపట్టిన సుజనా చౌదరి… టీడీపీ అనే ప్రాంతీయపార్టీతోనే నష్టపోయానని చెప్పుకొచ్చాడు. 1996 నుంచి ఏపీ రాజకీయాలు చంద్రబాబు, వైయస్ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయావు అంటూ పరోక్షంగా ఎన్టీఆర్‌కు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటును గుర్తు చేశాడు. ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం స్థిరమైందని బీజేపీలో చేరానంటూ లెక్చర్ ఇచ్చాడు.
తాజాగా ఇవాళ కూడా నూజివీడులో పాదయాత్ర నిర్వహించిన సుజనాచౌదరి చంద్రబాబుపై విమర్శలు చేశాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత కేంద్రం ఏపీకి సాయం చేసినా ఏమి చేయలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేశాడని సుజనా ఆరోపించాడు. చంద్రబాబు మోదీ రాష్ట్రానికి గుప్పెడు మట్టి, చెంబు నీళ్లు తప్పా…ఏమి ఇవ్వలేదని దుష్ప్రచారం చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యతిరేక ఓటింగ్‌తో వైసీపీ గెలిచిందని, రెండు కుటుంబాల మధ్య పోరుతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదని, బీజేపీతోనే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సుజనాచౌదరి ముక్తాయించాడు. అయితే సడన్‌గా సుజనా వైసీపీతో పాటు చంద్రబాబుపై విమర్శలు చేయడం (అదీ సుతిమెత్తగా )పై ఏపీ రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఒక పక్క ఏపీలో బీజేపీ బలోపేతానికి మోదీ, షాలు స్కెచ్‌లు వేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలను బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. వైసీపీకి ప్రత్నామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి సుజనా అడ్డంకిగా మారినట్లు అధిష్టానం భావిస్తోంది. టీడీపీ కీలక నేతలు బీజేపీలో చేరకుండా సుజనాచౌదరి అడ్డుకుంటున్నాడని కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పైగా చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తు కోసం సుజనాచౌదరితో రాయబారం నడిపిస్తున్నాడు. బీజేపీలో చంద్రబాబు కోవర్ట్‌గా సుజనా వ్యవహరిస్తున్నాడని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు.. సుజనా వ్యవహారశైలిపై కన్నేసిన కేంద్ర పెద్దలు…ఇక టీడీపీకి తలుపులు మూసేశామని, ఇక చంద్రబాబును దగ్గరకు రానిచ్చేది లేదని ఏపీ బీజేపీ ఇన్‌చార్జి , ఇతర కీలక నేతలతో ప్రకటనలు ఇప్పిస్తోంది. అంతే కాదు సుజనా చౌదరి కదలికలపై కేంద్ర పెద్దలు కన్నేసినట్లు సమాచారం. దీంతో భయపడిన సుజనా కొద్దిగా వాయిస్ మార్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ…జాతీయవాదం అంటూ లెక్చర్లు ఇస్తున్నాడు. మొత్తంగా బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోవర్ట్‌గా వ్యవహరిస్తున్న సుజనాచౌదరిపై అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా సుజనాకు, చంద్రబాబుకు ఉన్న చీకటిబంధాన్ని బయటపెట్టి…సాగనంపే అవకాశం ఉందని సమాచారం. అంతే కాదు బ్యాంకులకు 6 వేలు కోట్లు ఎగ్గొట్టిన సుజానాలాంటి ఆర్థిక నేరస్థుడిని పార్టీలో చేర్చుకుని తప్పు చేశామని మోదీ, షాలు భావిస్తున్నారంట..అందుకే కేసుల నుంచి తప్పించినా విశ్వాసం లేకుండా చంద్రబాబు పాట పాడుతున్న సుజనాకు చెక్ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమైందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుజనాచౌదరి చంద్రబాబుపై వాయిస్ పెంచి సుతిమెత్తగా విమర్శలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాబుగారిని తిట్టలేక తిడుతున్న సుజనాను చూసి అమ్మ సుజనా..నువ్వు నిజంగా మీ బాబుగారిని తిడుతున్నావా..తిడుతున్నట్లు నటిస్తున్నావా..అంటూ కాషాయనాథులు జోక్‌లు వేసుకుంటున్నారంట.