పిచ్ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్సర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కావడంతో కివీస్ జట్టు కెప్టెన్ కేనే విలియమ్సన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, తాము టాస్ గెలిస్తే..ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నామని, తాము కోరుకున్నదే వచ్చిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపారు.
ఇరు జట్లు
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హరిక్ పాండ్య, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యుజువేంద్ర చహల్
న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథం, హెన్రీ నికోలస్, గ్రాండ్ కోలిన్, మిట్చెల్ సాన్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్