విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో దాదాపుగా తొమ్మిది పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా వైసీపీ గూటికి చేరునున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకొని పోవటం, జిల్లాలో పెద్దవ్యక్తులు పార్టీని పట్టించుకోకుండా ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ని నమ్ముకున్నవారికి ఏం చేయకపోవడం వంటి కారణలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు జగన్ హవా వంటి కారణాలతో వైసీపీలోకి చేరేందుకు టీడీపీ కార్యకర్తలు క్యూ కడుతున్నారు.
