మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ను తాడేపల్లిలో కలవనున్నారు. ఆయనతో పాటు కొడుకు రామ్ చరణ్ కూడా సీఎం ను కలవనున్నాడు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా దీనిని రూపొందించారు.ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. అసలు ఈ భేటీ నాలుగురోజుల క్రితం జరగాలి. అయితే జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది వాయిదా పడింది.