టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ లు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు మురళీ మోహన్ లతో పాటు పరుచూరి గోపాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు కాబోయే వధూవరులకు శుభాభినందనలు తెలిపారు.
ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్ తో పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు pic.twitter.com/p5m3iMfIt5
— BARaju (@baraju_SuperHit) October 12, 2019
ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్ తో పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్ గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు హాజరయ్యారు pic.twitter.com/zrtvA1SKkM
— BARaju (@baraju_SuperHit) October 12, 2019