మట్టిలో మాణిక్యం అదే పదం వినే ఉంటారు కదా. అయితే ఈసారి వినడం కాదు వారిని చూడండి. పైన ఉన్న ఫోటోలో చూసారుగా వాళ్ళే మనకి దొరికిన అద్భుతాలు. వీరి ఐడియా ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే వీరికి క్యారమ్స్ ఆడాలనిపించి వారి చిన్న మెదడును ఉపయోగించి మట్టితోనే బోర్డును తయారుచేసుకున్నారు. ఇంకా కాయిన్స్ ఎలా అనుకుంటున్నారా వాటికి బదులుగా బాటిల్ మూతలను పెట్టారు. నేనే గెలిచా.. గెలిచా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న వారి ఆట ఆనంద్ మహీంద్రాను కదిలించింది. ఆయన వాట్సన్ కు వచ్చిన ఈ పిక్ ను అందరికోసం షేర్ చేసారు. ఈ పిల్లల క్రియేటివిటీకి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా భారతదేశంలో తెలివితేటలకు కొదవలేదని ఇది చూస్తే అర్ధమవుతుందని అన్నారు.