అటు కోలీవుడ్లోను, ఇటు టాలీవుడ్‌లోనూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన అనుష్క పెళ్లి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్పట్నుంచో అనుష్క పెళ్లిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయస్సు ముదిరిపోతుంది కాబట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్రశ్నలు పలు సందర్భాల్లో అనుష్కకు ఎదురయ్యాయి కూడాను. అయితే ఇప్పుడు పెళ్లిల సీజన్ జరుగుతంది. కనుక మరోసారి అనుష్క పెళ్లి చర్చ మొదలైయింది. అయి ఇంతకీ అనుష్క ఏం చేయబోతోంది అనేది మాత్రం ఇప్పటి వరకు దొరకని సమాధానం.
ఇక అసలు విషయానికొస్తే.. వరుస సినిమాలతో బిజీ జీవితాన్ని గడుపుతున్న అనుష్క వద్ద పెళ్లి మాట ఎత్తరంట కుటుంబ సభ్యులు. అనుష్కను పెళ్లికి ఒప్పించారట. అనుష్క జాతకం ప్రకారం అంతా మంచే జరుగుతుందని, త్వరలోనే పెళ్లి జరగనుందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో అనుష్క ఫ్యామిలీ కాస్త హ్యాప్పీగా ఫీలైందట. మరి అనుష్కను చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలి.