ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీ నేరవేరుస్తాడనే నమ్మకంతో ఆయనను గెలిపించడం జరిగింది. ఈ మేరకు గెలిచిన క్షణం నుండి నిరంతరం ప్రజలకోసమే కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నేలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చగా మిగతా పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేనప్పటికీ తిరిగి వారికి అన్యాయం చేసారని చెప్పాలి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రజలు బాబుకి తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ ని గెలిపించారు. రాష్ట్రంలో బాబుకి ఇంత వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో ఇప్పుడు తాను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యం పండిస్తున్నారు అనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు గాజువాకలో మీటింగ్ సందర్భంగా అక్కడ కార్పొరేటర్ ఒకరు మీరు ఇక్కడ పర్యటించకపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని అన్నాడు. దీనికి సమాధానం చెప్పిన చంద్రబాబు తాను మాట్లాడిన మాటలు హాస్యం పండించే విదంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. నేను ఎవరితో లాలూచీ పడదని, ఒకవేళ నేను అడుగుపెడితే ఖచ్చితంగా టీడీపీ గెలిచేదని అన్నాడు. అడుగుపెడితే టీడీపీ గెలిస్తే మరి మిగాతచోట్ల ఎందుకు గెలవలేకపోయిందో ఆయనకే తెలియాలి.