మోహన్‌బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి గాయత్రి అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కాగా, ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ మోహన్‌బాబు అటు కథానయకుడిగా.. ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్లు తెలిసింది. మోహన్‌బాబు విలన్‌గానే సినీ ప్రయాణం ప్రారంభించి ఆ తరువాత హీరోగా మారారు. ఇప్పుడు చాలా రోజుల తరువాత ఆయన మళ్లీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు మోహన్‌బాబు. అయితే ఈ సినిమాలో మోహన్ బాబులో ఇంతకు ముందు చూడని విలనిజాన్ని చూస్తారని దర్శకుడు మదన్ చెప్పుకొచ్చాడు.
