తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. గంటా వంటి నాయకులు అధికారం ఉన్న పార్టీలోకి రావడం అధికారం పోయిన తర్వాత వలస పక్షుల ఎగిరి పోతారని అలాగే తనతో పాటు ఉన్న వ్యక్తులను కూడా వేరే పార్టీలోకి తీసుకు పోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు తరచుగా ఉంటారని అన్నారు. అయితే దీనికి గంట వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. జనసేన పార్టీలో ఇంతవరకు ఎంత మంది చేరారు, ఎంత మంది వెళ్లిపోయారు తెలుసా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి, చింతలపూడి వెంకటరామయ్య, రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, నెల్లూరు జిల్లా కావలి నుంచి పసుపులేటి సుధాకర్, కృష్ణా జిల్లా నుంచి డేవిడ్ పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, తంబళ్లపల్లి విశ్వ ప్రభాకర్ రెడ్డి, తణుకు నుంచి పసుపులేటి రామారావు వీరి కోవలోనే పార్టీ అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ ఒంటి నాయకులు రాజీనామా చేయడం పవన్ కళ్యాణ్ కనిపించలేదా ఇతర పార్టీ నుంచి వ్యక్తులు వెళ్లిన వచ్చిన విమర్శించే నాయకుడు తన పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీనీ ఇలాగే వదిలేస్తే ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ఇతర పార్టీలకు నీతులు చెప్పేముందు రెండు చోట్ల ఎమ్మెల్యేగా కూడా కనీసం గెలవలేని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. నీను అంత బలహీనుడిని కాదు అని మాట్లాడిన పవన్, అతడి పార్టీ వదిలేసినా నాయకుల లిస్టు చూస్తే ఎంతడి బలహీనుడో బాగా అర్ధమవుతుందని అన్నారు.