జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ బాంబు పేల్చాడు. లింగమనేని గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి సంబంధించిన అనేక వ్యవహారాల్లో ఆయన ఉన్నారు. ఒక ఎన్నారైగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీకి అనేక రకాల సేవలు అందించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా నది ఒడ్డున ఉన్న గెస్ట్ హౌస్ కూడా లింగమనేని కి చెందినది కావడం గమనార్హం. మరోవైపు గుంటూరు జిల్లా టోల్‌ప్లాజా వద్ద పవన్ కళ్యాణ్ కు అతి తక్కువ రేట్ కి భూమిని కట్టబెట్టింది కూడా లింగమనేనినే. మరోవైపు పార్టీ వ్యవహారాలు కూడా లింగమనేని చూస్తున్నారు అని వార్తలు రావడంతో ఈ ఇరువురు ఈ రెండు పార్టీలకు సంబంధించి వ్యవహారాలన్నీ మరియు కార్యకలాపాలన్నీ వెనకుండి నడిపిస్తున్నారని అనుమానాలు స్పష్టం అవుతున్నాయి.