*చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో 1,522 .21 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 2019 ఆగష్టు లో 2,069.74 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయింది. అంటే దాదాపు 500 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అయింది.
*అంతేకాకుండా బాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఆగష్టు లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 44 .56 శాతం ఉంటే, జగన్ హయంలో 2019 ఆగష్టు లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 60.59 శాతానికి పెరిగింది.
*ఇక 2018 అక్టోబర్ లో పవర్ ఎక్స్చేంజి నుంచి యూనిట్ కరెంటు రూ. 6.21 కి కొంటే , జగన్ వచ్చాక 2019 అక్టోబర్ లో పవర్ ఎక్స్చేంజి నుంచి యూనిట్ కరెంటు రూ. 3.26 కు కొన్నాము.
*టీడీపీ హయంలో సోలార్ పవన్ విద్యుత్తూ సగటున యూనిట్ కు రూ. 4.84 పెట్టి కొంటే బాబు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను కోర్ట్ లో ఛాలెంజ్ చేయడం ద్వారా కోర్ట్ ఆదేశాలతో సగటున యూనిట్ రు 2.44 కు కొంటున్నాము.
*9 గంటల ఉచిత్ కరెంటు కోసం 4525 కోట్లు కేటాయించడం జరిగిందని విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.