వీవీ వినాయక్ ఈపేరు వింటే గుర్తొచ్చే మొదటి సినిమా ఠాగూర్.. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు ఈయన.. చిరు రీఎంట్రీలో కూడా వినాయక్ తోనే సినిమా చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. తాజాగా వినాయక్ ఫోటోషూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యంగా చిరంజీవి తమ్ముడిలా ఉన్నవంటూ ప్రసంసిస్తున్నారు. చిరంజీవి కూడా అనేక సందర్భాల్లో వినాయక్ నా సొంత తమ్ముడు అని చెప్పిన విషయం తెలిసిందే.
