మరో పద్నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ జరగనున్నది. ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు తమ తరపున అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ ఉత్తమ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగారు. ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఈ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరి బలం ఏమిటి..?. ఎవరి బలహీనత ఏమిటని అంశాలపై ఒక లుక్ వేద్దాం.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత నల్లగొండ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ . ఇదే ఈ పార్టీకి బలం. బలహీనత ఏమిటంటే ఎమ్మెల్యేగా ఉన్నా.. అధికారంలో ఉన్న కానీ నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమి చేయలేదు. నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డినే అనే అంశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలీకృతులవ్వడం కాంగ్రెస్ యొక్క ప్రధాన బలహీనత.
ఉత్తమ పద్మావతి రెడ్డి నాన్ లోకల్ అంటే వేరే నియోజకవర్గం నుండి ఓడిపోయి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నిలబడటం కూడా బలహీనతే. ఇక టీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే ఈ పార్టీకి బలహీనతల కంటే బలమైన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటం. గత ఎన్నికల్లో ఈ పార్టీ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డినే తిరిగి నిలబడటం.. గత ఎన్నికల్లో ఓడిపోయాడు కదా అని ప్రజల్లో సానుభూతి ఉండటం. అన్నిటికంటే గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ,కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. టీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా నల్లగొండ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం ఈ పార్టీకి ప్రధాన బలంగా చెబుతూ వస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.