విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పై దాడి జరిగింది.. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా భయటపడినట్టు సమాచారం.. తాజాగా ఈ ఘటనలో మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. రాజకీయ మరియు వ్యాపార కారణాల రీత్యా పీవీపీ పై టీవీ9 సీఈవో రవిప్రకాష్, ప్రముఖ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ పేర్లు వినిపిస్తున్నాయి. రవి ప్రకాష్, బండ్ల ప్లాన్ చేసి పీవీపీ పై దాడి చేయించారట. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి అసలు నిందితులను బయటకు తేవాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నారు. పీవీపీ పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. పీవీపీ మాల్స్ పేరుతో వ్యాపారాలు చేస్తున్నారు.