రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది మొదటి నుంచి చెపుతున్న నానుడే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అది సరిగ్గా నిజమైంది. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరూ చూసారు. కరువుకాటకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, సరైన వర్షాలు లేవు పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ముఖంలో చిరునవ్వు లేదు. ఎక్కడికక్కడ రైతు ఆత్మహత్యలు. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు క్రమంగా రైతుల మొహాల్లో చిరునవ్వులు. అయితే వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి అనేది రైతుల నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కాకుండా ఇప్పుడు వర్షాలు కురవడంతో పాటుగా అన్ని గ్రామాల్లో పచ్చని పైరు సంతరించుకున్నాయి. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభం కానుండడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామ సచివాలయం పక్కనే ఎరువుల దుకాణాలు పెట్టి రైతులకు ఎరువులు నాణ్యమైన పంటపొలాల ఔషధాలు ఉండడం ప్రభుత్వం రైతులకు ఇచ్చే గౌరవం నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
