ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ఓటమిని తానే ఒప్పుకున్నారు.. తనది నాలభయ్యేళ్ళ అనుభవమని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు సోషల్ మీడియా కేసులకు భయపడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.. సీఎం హోదాలో అనేక కేసులు పెట్టిన చద్రబాబు ఇపుడు ఆ కేసులకు భయపడటం చూస్తుంటే మొన్నటివరకు కేవలం చదువుకున్న వారికే తెలిసిన సోషల్ మీడియా ఇపుడు అందరికీ అర్థమైంది.. సాధారణంగా పార్టీ అధ్యక్షులు ఇవి పట్టించుకోరు. పార్టీకి అనుబంధ సంస్థలా ఇవి పని చేస్తాయి. అయితే చంద్రబాబు ఇపుడు సోషల్ మీడియా పైనే ఎక్కువసేపు మాట్లాడటం చూస్తుంటే తాను ఓడిపోవడానికి సోషల్ మీడియానే కారణం అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టు అయ్యింది.
