గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించ వద్దు అని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు జగన్ ను మెచ్చుకుంటున్నారు. చంద్రబాబు ఎయిర్ పోర్ట్ కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ ఆపి వేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ప్రజలు అంటున్నారు. బెంజ్ సర్కిల్, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు లోని వ్యాపారస్తులు కూడా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు ప్రజల క్షేమం కోరుతే ప్రజలు ఎంత ఆశీర్వదిస్తారు అనేదానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
