Home / ANDHRAPRADESH / వరంగల్ నగరంలో భక్తుల ఇండ్లలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పాదపూజల కార్యక్రమం..!

వరంగల్ నగరంలో భక్తుల ఇండ్లలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పాదపూజల కార్యక్రమం..!

వరంగల్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. గత నాలుగు రోజులుగా హన్మ కొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు పాల్గొని శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి, గోవిందరాజుల గుట్టపై అభయాంజనేయస్వామి, పైడిపల్లిలోని అమ్మవారి సమేత శివాలయంతో పాటు ఇవాళ మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు సందర్శించారు. అలాగే వరంగల్ నగరంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దేవి నవరాత్రుల కార్యక్రమాల్లో అమ్మవారికి స్వామివారు ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక వరంగల్ నగరంలోని భక్తుల కోరిక మేరకు స్వామివారు వారి ఇండ్లకు నేరుగా వెళ్లి అమ్మవారికి పాదపూజలు చేసి భక్తులను దీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ వరంగల్ గవిచర్ల రోడ్, గుంటూరుపల్లి లోని నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ( వెంకన్న ) గార్ల ఇంట్లో స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరు ఊరంతా స్వామి వారికి పూల వర్షంతో స్వాగతం పలికారు ప్రతి ఇంటి ముందు స్వామి వారు ప్రయాణిస్తున్న వాహనం ముందు నీళ్లు పోసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ విశిష్టతను స్వామివారు భక్తులకు వివరించారు. బుధవారం నాడు కూడా స్వామివారు భక్తుల ఇండ్లకు వెళ్లి పాదపూజలు నిర్వహించారు.  రెవెన్యూ కాలనీ లోని రాంమూర్తి పోలపల్లి, కట్కూరి రాజిరెడ్డి, హన్మకొండ బ్యాంకు కాలనీలోని ముత్యాల శ్రీనివాస్ , కాలువ నవీన్,
పొట్టి శ్రీనివాస్ తదితర భక్తుల ఇండ్లను స్వామివారు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సనాతన ధర్మం గొప్పతనం గురించి భక్తులకు వివరించారు. స్వయంగా తమ ఇండ్లకు వచ్చిన శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి భక్తులు పూలు చల్లుతూ..మేళతాళాల మధ్య శాస్తోక్తంగా స్వాగతం పలికారు. స్వామివారి పాదపూజల కార్యక్రమంలో ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, రాంమూర్తి పోలపల్లి, రోహిత్, పొట్టి శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, తదితర భక్తులు పాల్గొన్నారు.

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat