మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. అనంతరం తరవాత సినిమా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి గాను మీనాక్షి అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఐతే ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కండోమ్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తాడు. పులి వాసు చెప్పిన స్టొరీ ఆయనకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం టైటిల్ కూడా కండోమ్ ఫ్యాక్టరీనే. అయితే టైటిల్ బట్టి సినిమాలో ఎలాంటి నెగటివ్ సీన్స్ ఉండవని అంటున్నారు.