మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు గడ్డపై బ్రిటీష్ వారి పాలనను ఎదిరించిన పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదీలావుంటే ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి స్పదించారు. తన అభిప్రాయంను పేస్ బుక్ లో షేర్ చేశారు. సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి గారు ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారని ట్వీట్ చేశారు. జగపతిబాబు గారు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.