మొన్న భాను ప్రియ పనిమనిషి విషయంలో ఆమెను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లతో పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఇది అలా ఉండగా తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లకు కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే అప్పటి అందాల భామలు రాశి, రంభ ఇద్దరిపై విజయవాడలోని కన్జూమర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అనే విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో వీరిద్దరూ ఎక్కువగా ‘కలర్స్’ అనే యాడ్ లో కనిపిస్తున్నారు. అంతకముందు ఆ తరువాత అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే వారికి కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి వీరిద్దరూ ఒక్కప్పుడు బొద్దుగా ఉండేవారు, ఒక సినిమా కోసం వీరు చాలా సన్నంగా తయారయ్యారు. దీనినే ఉదాహరణగా తీసుకొని కలర్స్ యాజమాన్యం అంతకముందు, ఆ తరువాత అని మొదలుపెట్టారు. ఆ యాడ్ చూసి నమ్మి ఒక వ్యక్తి ట్రీట్మెంట్ కొరకు 74,652 రూపాయలు చెల్లించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి అయినా ఎలాంటి మార్పు రాకపోవడంతో వారిని అడడగా ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అలా కొన్ని రోజులు చూసిన యువకుడు కోర్ట్ ని ఆశ్రయించగా..పూర్తి వివరాలు పరిశీలించి అతడి 74,652 తో సహా 9% వడ్డీ తో తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇందులో యాజమాన్యం తప్పు ఎంతుందో హీరోయిన్ల తప్పు కూడా అంతే ఉందని వారికి వార్నింగ్ ఇచ్చారు.