గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల టెండర్లు దక్కించుకున్న నవయుగ సంస్థకు వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌తో షాక్ ఇచ్చింది. రివర్స్ టెండరింగ్‌లో తక్కువ కోట్ చేసి మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్ధ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. దీంతో నవయుగ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా నవయుగ సంస్థకు హైకోర్ట్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. . మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో పదేళ్ల క్రితం నవయుగ సంస్థతో జరిగిన ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ నవయుగ కోర్ట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్ట్ మాత్రం మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఒప్పందం రద్దు విషయంలో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.. అంతేకాక ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాలన్న నవయుగ విజ్ఞప్తినికూడా కోర్టు తోసిపుచ్చుతూ…కేసు విచారణను అక్టోబరు 25కు వాయిదా వేసింది. అవసరం అనుకుంటే ప్రభుత్వం పోర్టు నిర్మాణంకోసం కొత్తగా టెండర్లు పిలవచ్చని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే అక్టోబరు 25 వరకూ ఆ టెండర్లను ఖరారు చేయొద్దని ప్రభుత్వానికి కోర్ట్ సూచించింది. కాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణంకోసం 2010లో నవయుగ సంస్థతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. దాదాపు 10 సంవత్సరాలు కావొస్తున్నా పోర్టు నిర్మాణం కోసం ఒక్క అడుగుకూడా ముందుకుపడలేదు. చంద్రబాబు సర్కారులో పోలవరం టెండర్లు అధికమొత్తానికి దక్కించుకున్న నవయుగ సంస్థ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ విషయంలో మాత్రం ఒక్క పని కూడా చేపట్టలేదు. దీంతోపాటునవయుగకు కేటాయించిన 471 ఎకరాలకుగాను ఒక్కపైసా కూడా ఆసంస్థ చెల్లించలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ఆ గస్టు 8 వ తేదీన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో నవయుగతో జరిగిన ఒప్పందాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాల్‌చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాగా తాజాగా జరిగిన విచారణలో నవయుగకు ఎదురుదెబ్బ తగిలింది. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో కూడా రివర్స్ టెండరింగ్ వెళ్లవచ్చంటూ ప్రభుత్వానికి హైకోర్ట్ అనుమతి ఇచ్చింది. మొత్తంగా పోలవరం రివర్స్టెండర్తో సక్సెస్ అయిన సీఎం జగన్…మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో కూడా రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.