అక్టోబరు 2న అంటే (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవునున్నాయి.. డిసెంబర్ 1నాటికల్లా గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలని, సీఎం సూచించారు. నవంబర్ నెలాఖరునాటికల్లా అన్ని సదుపాయాలు ఉండాలని, గ్రామ సచివాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి ఏవైనా లోపాలు ఉంటే వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలిని, జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరులకు అందాలన సీఎం సూచించారు. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో బోర్డులపై పెట్టాలని, జనవరి 1నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. గ్రామ సచివాలయాలు జనవరి 1నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక ప్రతిరోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలన్నారు.
72గంటల్లోగా రేషన్‌కార్డు, పెన్షన్లు లాంటి సేవలు అందాలని, ఎటువంటి వివక్ష, పక్షపాతం లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు సేవలందాలన్నారు. గ్రామ సచివాలయాలనుంచి కలెక్టర్లకు, శాఖాధిపతులకు అనుసంధానం ఉండాలని,
దేశంలోనే ఇలాంటి కార్యక్రమం జరగట్లేదన్నారు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా పరిపాలనలో ఇది విప్లవాత్మక మార్పని,
కలెక్టర్లు, అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాసపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు.. ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు.. ఈ అంశాలను వారికి వివరించాలన్నారు. మొత్తమ్మీద మరో 24గంటల్లో గ్రామ సచివాలయాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో పెద్దఎత్తున రాష్ట్ర ప్రజలు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.