క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును మర్చిపోలేరు. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రోజు ఇది. పాక్ గడ్డపై గంగూలీ గర్జించడంతో ప్రతి భారతీయుడు మీసం మెలేసారు. అలా టీమిండియా పాకిస్తాన్ పై కాలర్ ఎగరేసి నేటికి 22ఏళ్ళు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య 1989-90లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా పాక్ పర్యటనకు దూరంగా ఉంది. ఆ తరువాత దాదాపు 8ఏళ్ల తరువాత భారత జట్టు వారితో మూడు వన్డేల సిరీస్ ఆడడానికి వెళ్లారు. పాకిస్తాన్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇరు బోర్డులు సిరీస్ నిర్వహించడానికి నిర్ణయించుకున్నాయి. ఈ మూడు వన్డేలలో భాగంగా మొదటి మ్యాచ్ సజావుగా సాగగా.. రెండో మ్యాచ్ ఇదే రోజున కరాచీ వేదికగా ప్రారంభం అయ్యింది.
అయితే ఈ మ్యాచ్ మామోలుగా కాకుండా యుద్ధ వాతావరణాన్ని తిలకించే విధంగా తయారయ్యింది. ఈ మ్యాచ్ లో భాగంగా భారత అభిమానులు, క్రికెటర్స్ పై కొందరు రాళ్ళు విసురుతూ నాలుగైదు సార్లు మ్యాచ్ కు ఆటంకం కలిగించారు. దాంతో మ్యాచ్ 47 ఓవర్లకే కుదించడం జరిగింది. ఇంత అవమానం జరిగాక మ్యాచ్ గెలవకపోతే భారత్ పరువు పోయినట్టే.. కాని అలా జరగకుండా యావత్ భారత్ ప్రజానికం గర్వపడేలా పాక్ పై ఘన విజయం సాధించారు. తొలిత బ్యాట్టింగ్ చేసిన భారత్ సచిన్ టెండూల్కర్ తక్కువ స్కోర్ కే అవుట్ అవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. అప్పుడే వచ్చిన గంగూలీ తన విద్వంసకర బ్యాట్టింగ్ తో పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు. దాంతో భారత్ 266 పరుగుల లక్ష్యాన్ని పాక్ కు ఇచ్చింది. ఈ అపురూపమైన ఘట్టానికి ఈరోజుతో 22ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు దానికి సంభందించి ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.